Monday, September 1, 2008

జోక్ అఫ్ ది డే. ...

పక్కింటి రాణి చెప్పింది 'మీరు మన పనిమనిషి తో ఏదో "పెద్దల సినిమా" కి వెళ్లారట'. కోపం తో అడిగింది వెంగలమ్మ భర్త కేసవరావు ని. .మీ జేబు లో ఇవి దొరికాయి అంటు రెండు టికెట్స్ లు కూడా చూపిస్తూ అగ్గి మీద గుగ్గిలం అయ్యింది వెంగలమ్మ..
పట్టుబడిపోయాను ర దేవుడా అనుకుంటూ ఇంక చేసేది ఏమి లేక.తప్పు ఒప్పుకుంటూ అంటదు కేసవరావు ..'సారీ వెంగు.ఇంకెప్పుడు ఇలా చేయను .నన్ను నమ్ము '.
....
"అదేం కుదరదు.ఈ మధ్య మీకు దుబారా బాగా ఎక్కువైంది .
ఆ టికెట్ డబ్బులు దాని జీతం లోంచి కట్ చేస్తాను".ఇంకో సారి సినిమా కి వెళ్తే,దాని టికెట్ దాన్నే కొన్నుకోమనండి" ......అని చెప్పిన వెంగలమ్మ ని చూస్తూ విస్తుపోతాడు కేసవరావు..:)))

No comments: